Sunday, April 27, 2025

the year ahead (2024-2025)

(Inspired from MM: a blog post on every birthday.)

Though it's, already 9 months into it ( today 27th Apr 2025), I believe in doing the right thing, and late is better than later!!

In the last 9 months, I got better at trading ( graduated to automation/ bots), started affiliate marketing in crypto ai space, authored  The Great AI Debate , and  learned Python thoroughly, though I haven't got much chance to practice my coding skills further yet. There's good scope for monetizing what's done.

It's unbelievable, that time is rolling by like anything. It's the most heard & insipid cliche, though the truth in it blunts every other emotion, and make you stand naked, or  for a better word : sense  objectivity or the lack of it.

It's like I haven't achieved what I set out to do in life, and in fact, it means that I have been growing distant from my own goals all this while.

In hindsight, I'm wondering I'm far less than human, as I have not used ( for whatever) my own capabilities, to my surprise. I feel like: I have been kinda prepared thoroughly, but never really appeared for exams. Yes, that's what I feel exactly.

Today, as I see, before my next birth day, I want to achieve 2 things. First one is I've got to be too good at trading ( to the extent that I should like myself). And the second one is : it's been my about 20 years dream to get into film making. I should make progress about it.
Achieving these two goals quickly, helps me do better towards my next ambition - entering public life/service.

By achieving these two goals fast, I may be able to put seeds of new thinking about what's possible, and it's likely going to expand their horizons, to propel themselves onto much wider canvas. People badly need such guidance!

Though I never thought I would become single (& single parent), I've no plans to get into any serious relationship with anyone, ever again. I'm fortunate to have super smart kid, and she's almost always a bundle of fun.

To pave the way for second goal, we may need to shift to Mumbai, or USA, and being unhinged, I see it's going to be ok for myself and my kid Anuhya.

Trust this helps me with increased focus, on my twin goals, for next 3 months.

I can be connected on my X.

Thursday, August 16, 2018

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మీడియా !

తెలుగు రాష్ట్రాలలో మీడియా ప్రభావం గురించి కొత్త పుంతలు తొక్కుతోంది.

NTR  రాజకీయ ఆరంగేట్రం నుంచి, తెలుగు దేశం ప్రభుత్వం వచ్చేవరకు, అలాగే 1994 లో ఎన్టీఆర్ ని గద్దె దింపే వరకు, కొన్ని పత్రికల పాత్ర చాలా కీలకం అయింది.  ఈ పత్రికలు పూర్తి గ ఏక పక్షం గా వ్యవహరించటం మామూలు విషయం అయిపొయింది. తాము అభిమానించే పార్టీ వాల్లే  ఎన్నికల్లో గెలవటానికి, ప్రభుత్వం ఏర్పడటానికి తమ పాత్ర నిర్ధ్వందం గా  నిర్వర్తిస్తూ వస్తున్నాయి.

మునుపటి  రోజుల్లో వాళ్ళు ఏమి రాసినా చెల్లిపోయేది.  అందువల్ల పత్రికల ప్రభావం అధికం గా  ఉండేది.

నిజానికి  ఇప్పుడు  పరిస్థితులు చాలా మారిపోయినాయి. టెక్నాలజీ పుణ్యమా అని, ప్రపంచం లో ఏ మూలాన ఏమి జరిగినా  మనకి క్షణాల్లో తెలిసిపోతున్నాయి.  నిజానికి పత్రికల పాత్ర ఆ మేరకు తగ్గాలి.

కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అక్షరాస్యత ( Telangana - 66.5% and AP - 67.4%) చాల తక్కువ గా వుంది. ఇంటర్నెట్ ఉపయోగించే వాళ్ల సంఖ్య కూడా తక్కువ గా వుంది. ఎక్కువ  మంది ఇంకా పాత అలవాట్లైన: ఉదయాన్నే పేపర్ చదవడం, టీవీ లో వార్తలు చూడటం వాటికే పరిమితమయ్యారని భావించవచ్చు. అందువల్ల ఎక్కువమంది ని పత్రికలు , టీవీ లే ప్రభావితం చేస్తున్నాయి.


ముఖ్యం గా చాలా మంది అమాయమకంగా టీవీ లో చూసినవన్నీ నమ్మేస్తుంటారు , పత్రిక లో వచ్చిన వాటిని సందేహించరు. 
రాజకేయాలు అంటే అబద్ధాలు చెప్పటమే అయిపోయిన ఈ రోజుల్లో ఇది చాలా ప్రమాదకరంగ పరిణమిస్తుంది.

కొన్ని పత్రికలు  స్వతంత్రంగా కాకుండా, కొందరి రాజకీయ నాయకుల సొత్తు వలె ప్రవర్తిస్తున్నాయి. అడ్డగోలు గా వాదిస్తున్నాయి, వైరి పక్షాల నడ్డి విరిచే భాద్యతలు తమపై వేసుకుని తాము చెప్పిందే వేదం అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. వాటి స్వామి భక్తి కి అవధుల్లేకున్నా వుంది.

ఎవరికి నష్టం ?

ప్రజలు విద్యావంతులు, వివేకవంతులు అయితే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అట్లా కానప్పుడు, అంటే నిరక్షరాస్యత, అమాయకత్వం మరియు అవివేకం ప్రజల్లో ఎక్కువ గా ఉన్నందువల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఇట్లా జరగడానికి కొన్ని పత్రికలూ యదేశ్చ గా పనిచేస్తున్నాయి.
ఈ నష్టం ఇక్కడితో ఆగిపోదు. భావితరాలకు చేరుతుంది, దేశ అభివృద్ధి ని కుంటిపజేస్తుంది.

పోలారిజషన్ 

ఈ రోజుల్లో కూడా తెల్లని వన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని నమ్మేవాళ్ళు చాలా మందే వున్నారు. స్వార్ధ రాజకీయాలకు, వాళ్లకి వంత పాడే పత్రికలకు ఇలాంటి అమాయక ప్రజలు బలి అవుతున్నారు. ఇందులో చాలామంది చదువుకున్న వాళ్లు కూడా వున్నారు.

మీడియా సెన్సషలిజం, ఫ్యావోరిటిజం చుట్టూ తిరుగుతున్నంత వరకూ క్వాలిటీ ఆశించడం వృధా.


పరిష్కారం ?

దాదాపు ప్రతీ మీడియా సంస్థ ఏదొక రాజకీయ పార్టీ కి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది, దాని పక్షపాతి గా వ్యవహరిస్తోంది.  తరచుగా వీటిలో వచ్చే వార్తలు కూడా ఆ పార్టీ కి ఒక వ్యాపార ప్రకటనల్లాగ తయారయినాయి. మంచి చెడులు లేవు. నీతి నియమాలు లేవు.

జాతీయ పత్రికల్లో కొన్ని బీజేపీ కి అనుకూలంగా ఉంటె, మరి కొన్ని కాంగ్రెస్స్ కి దగ్గర గా పని చేస్తున్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ వరకు వస్తే దాదాపు అన్ని మీడియా సంస్థలు బీజేపీ కి వ్యతిరేకిస్తున్నాయి. పత్రిక స్వాతంత్య్రం, నిబద్ధత అనేవి మచ్చు కైనా కనిపించవు. సొంత గొంతు మర్చిపోయినట్టు, ఆర్ధిక ప్రోత్సాహాల కి అలవాటై ,  రాజకీయ పార్టీ లకు అనుకూలం గా వల్లె వేస్తున్నాయి. అవసరమైతే నిజాలని తొక్కి పెడుతున్నాయి. వాటికవే న్యాయస్తానాల్లాగా అనేసుకుని, ఇష్టమైనట్టు జడ్జిమెంట్ ఇచ్ఛేస్తున్నారు.

సగటు మనిషి కి ఈ విషయాలు గ్రహించే అవకాశం లేదు. ఏ రోజైతే ఈ పరిస్థితి మారుతుందో, తప్పు వార్తలు ప్రచురించినందుకు న్యాయస్థానాల చుట్టూ తిరిగే పరిస్థితి రావచ్చు. కానీ మీడియా ని నియంత్రించేందుకు ఒక స్వతంత్ర సంస్థ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. అది జరిగే వరకు ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తారు.

అప్పటివరకు, ప్రజాస్వామ్యం కి నాలుగవ మూలస్థంభమైన మీడియా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూనే ఉంటుంది.